ముఖ పత్రం

ప్రియమైన చదువరీ!

                                                                 


                            తెలుగులో కథలు వెలువడడం మొదలై వందేళ్ళు గడచిన సందర్భంగా తెలుగు కథానికా శతవార్షికోత్సవాలను జరుపుకోవటానికి పలు సాహితీ సంస్థలు, కథాభిమానులు ఇప్పటికే వారి వారి ప్రయత్నాలను ప్రారంభించారు. పలుచోట్ల కథానికా సదస్సులు జరుగుతున్నయి. ఈ ఉత్సవాలలో భాగంగా వర్తమాన కథా రచయితల కథలను ఒక్కొక్కరివి మచ్చుకు ఒకటి చొప్పున కనీసం వెయ్యి కథలతో ఒక బృహత్కథా సంకలనాన్ని పది వాల్యూములలో మా అబ్జ క్రియేషన్స్ సాహిత్య సాంస్కృతిక సంస్థ పక్షాన తీసుకువస్తే బాగుంటుందని అనుకొన్నాము. వస్తుపరంగానూ, భాషాపరంగానూ, శైలీశిల్పాల రీత్యానూ కథాప్రక్రియలో వచ్చిన అన్ని ప్రయోగాలనూ, పరిణామాలనూ ఈ సంకలనం ప్రతిబింబించాలని ఆశించాము. అయితే ఆర్థిక కారణాల దృష్ట్యా సఫలీకృతం కాదేమోనన్న శంక మా ప్రయత్నాన్ని మొదటిలోనే బెడసికొట్టింది. కానీ వందేళ్ళ తెలుగు కథా సాహిత్యానికి ఏదో ఒకటి చేయాలన్న తపన ఈ వెబ్ సైటునుప్రారంభించడానికి పురిగొల్పింది. చిన్నా పెద్దా, కొత్తా పాతా, తమపర భేదాలు లేకుండా అందరు కథా రచయితలను కలుపుకొని చేయబోయే ఈ ప్రయత్నం సఫలీకృతమౌతుందని గట్టిగా నమ్ముతున్నాము. మేము ఇంతకుముందే కథాజగత్ పేరుతో ఒక కథాసంకలనాన్ని ప్రకటించాము. ఆ పుస్తకం అందరి అభిమానాన్ని చూరగొనింది. అదే పేరుతో ప్రతిఏటా ఒక కథాసంకలనాన్ని ప్రకటించమని పలువురు శ్రేయోభిలాషులు సూచించారు. కానీ ఇప్పటికే పలు కథావార్షికలు వెలువడుతుండటం వలన మేమా సాహసానికి పూనుకోవడంలేదు. మాకు, మా సంస్థకు గుర్తింపు తెచ్చిన కథాజగత్ శీర్షికనే ఈ వెబ్ సైటుకు శీర్షికగా నిర్ణయించడం జరిగింది. మా ఈ కథాజగత్తుకు మీ అమూల్యమైన సూచనలు సలహాలు అత్యావశ్యకం. అవే ఈ ప్రయత్నాన్నిముందుకు నడిపే సాధనాలు.


భవదీయుడు


కోడీహళ్ళి మురళీమోహన్
వ్యవస్థాపక కార్యదర్శి
అబ్జ క్రియేషన్స్ సాహిత్యసాంస్కృతిక సంస్థ
హైదరాబాదు

మీ అభిప్రాయాలు

అభిప్రాయాలు


Comments