బొడ్డు - బి.వి.డి.ప్రసాదరావు

 
   
"అయ్యో, ఒళ్లు చాలా కమిలింది." - పక్కింటావిడ అంది.

    సురేఖ జవాబు ఇవ్వలేదు.

    "రోజూ వినిపిస్తోంది. ఏమిటి గొడవలమ్మా?" - పక్కింటావిడ.

    మళ్లీ జవాబు లేదు సురేఖ నుండి.

    "అడుగమ్మా. నీ నోరు వినిపించదు. ఎందుకు నాన్చుతున్నావు? ఎంత భర్త ఐనా!" 

    సురేఖ చెప్పింది - "అతను ఈ పిల్లలకు తండ్రి అమ్మా ..."

    పక్కింటావిడ ఆలోచనలో పడింది.
                                               
Comments