హృదయం - గంధం విజయలక్ష్మి

    
    జయ ప్రొద్దునే లేచి కాలేజికి వెళ్ళడానికి తయారు అవుతున్న  సమయంలో ఫోన్ వస్తుంది. తనకు చదువు చెప్పిన ఆచార్యులకు ఆరొగ్యము బాగాలేదని తెలిసి బయలు దేరుతుంది. ఏవొ ఆలోచిస్తూ మగత నిద్రలోకి జారుకుంటుంది. జూబ్లీబస్టాండ్ అని కండక్టర్ పిలుపుతో ఈ లోకంలోకి వస్తుంది. హడావిడిగ దిగి ఆటొ ఎక్కి భారమైన మనస్సుతో ఆచార్యుల ఇంటి ముందు దిగుతుంది. 
హడవిడిగా లోపలికి వెళ్తుంది. గురువుగారు బెడ్ మీద పడుకొని ఉంటాడు. 28సంవత్సరాలు ఉంటాయనుకుంటా అతను ఆచార్యులుగారికి సపర్యలు చేస్తుంటాడు. అతన్ని  చూడగానే ఎక్కడొ చూసినట్టుగ ఉందే అనిపిస్తుంది. గుర్తుకురాదు. 

    తన రాకను గమనించిన ఆచార్యులవారు "జయా ఇపుడేనా రావడం? ఎలా ఉన్నావమ్మా? కొత్త చోటు కొత్త ఉద్యొగం. ఎలా ఉంటున్నావొ అని ఆలొచిచ్తూ ఉండేవాణ్ణి". 

    "నేను బాగానే ఉన్నాను. మీకు బాగా లేదని తెలిసి ఉండలేకపొయను" అని ఏడుస్తుంది. 

    "నేను మీకు ఏమి కానిదాన్ని అనేగా నాకు తొందరగా చెప్పలేదు." మరీ చిన్న పిల్లలాగ ఏడుస్తుంది. 

    "చూడమ్మా కొత్తగా కాలేజిలొ లెక్చరెర్ గా చేరావు కదా. అక్కడి పరిస్థితులన్ని నీకు అలవాటు కాకముందే సెలవు పెట్టి వస్తే బాగుండదని నేనే చెప్పలేదు. నాకు ఇప్పుడు పర్వాలేదు. బాగానే ఉన్నాను. నువ్వు దిగులు పడకు" అని జయను ఊర్కొబెడతారు ఆచార్యులవారు.

    "ఇదిగో ఈ అబ్బాయి కూడ నా శిష్యుడే. నీకంటె 5సం సీనియర్. నువ్వు నా దగ్గరికి ఎం.ఎ చదువుకోడానికి వచ్చేసరికి ఈ గ్రూప్1 ఆఫీసర్ గా ఉద్యొగం వచ్చి వెళ్లిపొయాడు. మంచివాడు. బుద్ధిమంతుడు. అతనే వచ్చి నన్ను ఆసుపత్రికి తీసుకువెళ్ళి ఆరోజు నుండి సపర్యలు చేస్తున్నాడు. ఆ సేవల మూలంగానే నేను తొందరగా కోలుకున్నాను. ఆ మీ ఇద్దరికి పరిచయం చేయలేదు కదా. ఇతని పేరు ఇంద్ర  గ్రూప్1 ఆఫీసర్ గా నిజమాబాద్ లొ ఉద్యొగ బాధ్యతలు నిర్వహిస్తున్నాడు" అని జయకు పరిచయం  చేస్తాడు. రెండు చేతులు జోడించి నమస్కారం  చేస్తుంది. అతన్ని చూడగానే తనకు తెలియని ఏదొ భావన కలుగుతుంది. 

    "జయ జూనియర్ లెక్చరర్‌గా ఈ మద్యనే ఉద్యొగము చేస్తోంది." ఇంద్ర ప్రతి నమస్కారం  చేస్తాడు. జయ అందచందాలు అణుకువ మట్లాడే విధానం బాగా  నచ్చుతుంది ఇంద్రకి.

    ఆ రోజు ఉండి మర్నాడు ఇంద్ర బయలుదేరడానికి సిద్ధమవుతాడు. ఆచార్యుల వారి పాదాలకు నమస్కారము చేసి బయలుదేరే సమయంలో  ఆచార్యులవారు  "ఇంద్రా నువ్వు వెళ్ళేది నిజామాబాద్ కదా?" అంటారు. 

    "అవును" అంటాడు ఇంద్ర. 

    "అయితే జయకు కామారెడ్డి వరకు తోడుగా ఉండి కామారెడ్డిలో  ఆ అమ్మాయిని వాళ్ళింటి దగ్గర వదిలి వెళ్ళు"  అంటారు

    లాగే అని ఇద్దరు బయలుదేరుతారు. ప్రయాణం  చేసేటప్పుడు ఎన్నొ రోజుల పరిచయం ఉన్నట్టుగా మాట్లాడుతుంటాడు ఇంద్ర.  మాటల మధ్యలొ తనకు అమ్మా నాన్నా లేరని అన్నయ్య వదిన చదివించారు అని చెబుతుంటాడు. ఒకరి కుటుంబం గురించి ఒక్కరు అన్ని విషయాలు చెప్పుకుంటారు. ఇంతలో కామారెడ్డి వస్తుంది జయ దిగడానికి సిద్ధమవుతుంది. 

    "నేను ఇంటి వరకు వచ్చి దిగబెడతాను" అంటాడు ఇంద్ర. 

    "వద్దు నేను వెళ్తాను. మీకు ఆలస్యము  వుతుంది" అంటూ సంశయిస్తూనే "మీ సెల్ నంబర్" అని అడుగుతుంది. 

    అప్పుడు ఇంద్ర "ఇది నా పర్సనల్  నంబర్.  మీకెప్పుడు చెయ్యాలి అనిపిస్తె అప్పుడు చేయండి" అని ఇస్తాడు. 

    జయ  నంబర్  కూడా తీసుకుంటాడు. రెండ్రొజుల తర్వాత జయ రాత్రి 9.00గం లకు ఫొన్  చేస్తుంది. ఇంద్ర రిసివ్  చేసుకుని మాట్లాడుతుంటాడు. 

    ఇద్దరి మద్య ఎటువంటి దాపరికాలు లేకుండా మాట్లాడుకోవడం రోజురోజుకి ఒకరి మీద ఒకరికి చెప్పరాని అబిమానం ఏర్పడుతుంది. జయకు  ప్పుడూ అతని అలొచనలే. ప్పుడెప్పుడు అతన్ని చూడాలని మనస్సు ఉవ్విళ్ళురుతుంది. కాని ఆరు నెలలు కావస్తున్నా సందర్బము రాలేదు. 

    ఒక రోజు అనుకొకుండా జయకు  నిజామాబాద్  వెళ్ళాల్సి రావడంతొ ఇంద్రకు ఫొన్  చేస్తుంది మర్నాడు   నిజామాబాద్  లొ దిగగానే ఇంద్ర వచ్చి రిసివ్  చేసుకుంటాడు. జయకు సంబంధించిన పనులు అయ్యేసరికి సాయంత్రం అవుతుంది. జయను ఇంటికి తీసుకువెళ్తాడు.

    జయకు  న్నో కోరికలు ఉద్బవిస్తుంటాయి. మనసులొ అతన్ని చూడగానే కలిగిన ఇష్టం వల్ల  అనుకుంటా ఆచార్యులవారు అతని గురించి చెప్పినప్పుడు, జిల్లా అధికారిగా ప్రజలకు చెసే సహయ కార్యక్రమాలు పత్రికలలొ చదివినప్పుడు అతని మీద చెప్పలేనంత ప్రేమను పెంచుకుంటుంది.

    ఆ ఇంట్లొ ఇద్దరే ఉంటారు. అతని ప్రతి కదలికను గమనిస్తుంటుంది జయ. భోజనాలు అయిన తర్వాత కబుర్లు చెప్పుకుంటూ కూర్చుంటారు.

    ఇంద్రకు దగ్గర కావాలి అని ఆలోచిస్తుంటుంది. తన  చేతల ద్వారా వ్యక్తం  చేస్తుంటుంది. ఇంద్ర జయ మనస్తత్వాన్ని పసిగట్టి మంచి మాటలు చెబుతూ దగ్గరకు తీసుకుంటాడు. ఒక్కసారిగా జయ అతన్ని అల్లుకుపొతుంది. 

    ఇంద్ర  "జయా! నిన్ను చూడగానే నువ్వే నా జీవిత భాగస్వామి కావాలి అనుకున్నాను. నా మనసులో నిన్ను దేవతగా నిలుపుకు న్నాను. మా అన్నయ్య వదినతో వచ్చి మీ ఇంట్లో వాళ్ళతో  మాట్లాడి పెండ్లికి ముహుర్తాలు పెట్టిస్తాను" అంటూ జయని తన హృదయానికి హత్తుకుని నుదుటి మీద ముద్దు పెట్టి అమాంతంగా  త్తుకుని మంచం మీద పడుకోబెట్టి ఆమె మీదకు వంగి ఆమె తలని సుతారంగా నిమురుతూ మెడ మీదా ముద్దు పెట్టి "జయా నువ్వు హయిగా నిద్రపో" అని నిద్ర పుచ్చుతాడు. 

    జయ నిద్ర పో యింది అనుకుని ఇంద్ర తను వచ్చి హాల్ లో పడుకుంటాడు. జయ నిద్రపొయినట్టు నటిస్తుంది.  కాని నిద్రపోదు. ఏవొ ఆలోచనలతో నిద్ర పట్టదు. ఉదయం 6 గంలకు జయా  అంటూ  కాఫీ  తీసుకువస్తాడు ఇంద్ర.

    కాఫీ తాగి తయారై బయలుదేరుతుంది. జయ రైల్వే స్టేషన్ కు వచ్చి రైలు క్కింది. ఇంద్ర వెళ్ళిపోతాడు. అతను వెళ్ళిన వైపే కిటికీలోంచి చూస్తుంది జయ.

    అలా కొన్ని  రోజులు గడిచి పోతాయి. ఇంద్ర వీలు  చూసుకుని  అన్నయ్య వదినను జయ వాళ్ళింటికి  తీసుకువెళ్తాడు. వాళ్ళింటి వాళ్ళతో  పెండ్లి గురించి  మాట్లాడతాడు. ఇరు ప్రక్కల పెద్దలు ఒప్పుకుంటారు. ఆచార్యుల ఆశీర్వాదంతో పెండ్లి నిరాండబరంగా జరుగుతుంది. 

     రోజు శోభనం. జయకు తెలియని గుబులు బయలుదేరుతుంది. ఎందుకంటే తాను ఎంత దగ్గర కావాలనుకుంటే తనను ఆ రోజు అంత దూరంగా ఉంచాడు అనుకుంటూ ఉండగానే ఇంద్ర  శోభనం గదిలోకి అడుగు పెడతాడు.            

    జయ తనను సమీపించిన ఇంద్ర రాకను గమనించదు.

    "జయా!" అని ఇంద్ర పిలువగనే ఉలిక్కిపడుతుంది.  "ఏంటి జయా  దీర్ఘాలోచనలో ఉన్నావు" అంటాడు.   

    "ఆ... ఆ... ఏమీలేదు" అంటుంది. మెల్లిగా దగ్గరకు తీసుకుంటూ "నీ అందచందాలు నీ అణకువ నాకు నచ్చాయి. మొదట  ఆచార్యుల వారి  ఇంట్లో నిన్ను చూసినప్పుడు నీ కండ్లలొ మెరుపు చూసి నేను ఎంతగానో సంతోషించాను. జీవితాంతం నీ కండ్లలో ఆ మెరుపు చూడాలనే ఆ రోజు దూరంగా ఉంచాను. ఆ క్షణంలో నీకు దగ్గరయి ఉంటే అందరి మగవాళ్ళ మాదిరిగానే నన్ను అనుకునే దానివి పెండ్లికి అటంకాలు ఏర్పడితే ఆడపిల్ల మనసు ఎంత క్షోభను అనుభవిస్తుందో నాకు తెలుసు. అందుకే ఆ రోజు నీకు నేను దురంగా ఉన్నాను" అంటుండగానే అతన్ని పట్టుకుని ఏడుస్తుంది. "నన్ను క్షమించండి" అంటూ అతని కాళ్ళ మీద పడుతుంది. "జయా  నీ స్థానం అక్కడ కాదు ఇక్కడ" అంటూ హృదయానికి హత్తుకుంటాడు. 

    ఇంద్రతో జయ జీవితం మూడు పువ్వులు ఆరు కాయలుగా కొనసాగుతుంది .
Comments