కర్రి వర్రి - మన్నెం ఏలియా

శ్రీలక్ష్మిలో ఏదో మార్పు కడనబడుతోంది భర్త సుబ్బారావుకు. వార్త పత్రికల్లో వచ్చే వంటా వార్పు పేపర్లను సేకరించి భద్రంగా దాచుకొంటుంది. మధ్యాహ్నం టీవి చానల్లలో వచ్చే ఘుమఘుమలు, మావూరి వంట, చూద్దాం చేద్దాం, రుచి, వంటలు వార్పులు ఒకటీ వదిలి పెట్టకుండ శ్రద్ధగా చూస్తూ ఒక డైరిలో నోటు చేసుకుంటుంది. ఏదైనా రెండు చానల్లలో ఒకే టైంలో కొర్యక్రమము వస్తే, యూట్యూబ్లో చూసి వురి రాసుకొంటుంది.

అపుడప్పడు కొన్ని ప్రయోగాలు జరుగుతున్నాయి వంటల్లో

ఏనాడు సుబ్బారావు భార్యనుగాని, వంటనుగాని మెచ్చుకోలేదు. పెత్తైన కొత్తలో వంట చేస్తే తిడుతూనే తినేవాడు. ఆడదానికి వంట చేయడం ఒక కళ, అది నీకు రాదు. అలాంటి భార్యను పొందే అదృష్టం నాకు రాసి పెట్టిలేదు అని బాధపడేవాడు.

అప్పట్లో పత్రికల్లో, టీవిల్లో ఇన్ని కార్యక్రమాలు వచ్చేవి కావు. దూరదర్శన్ ఒక్క చానలే వుండడం వల్ల ఇన్ని ప్రయోగాలు చేసే అవకాశం వుండేది కాదు.

ఎన్ని రకాల వంటలు చేసి పెట్టిన నిశ్శబ్దంగా హెూటల్లో తిన్నట్టే తింటున్నాడు. కాని శ్రీ లక్ష్మి ఆశించినట్టు చిన్న మెచ్చుకోలు కూడా లేదు. భర్త నుండి ప్రశంసల కోసం చేయని ప్రయోగం లేదు. కాని ఎప్పడు నిరాశె ఎదురవుతోంది.

“ఇంకా బాగా వంట చేసి పెట్టాలి మా ఆయనకు, నచ్చెలా, మెచ్చెలా అనుకొని శ్రద్ధపెట్టిక్రమం తప్పకుండా ఫాలో అవుతుంది.

ఈ మధ్య పవర్ కట్ (కరెంటు కోత) ఎక్కువుందని ఇన్వర్టర్ పెట్టించడం వల్ల ఏ కార్యక్రమం మిన్స్ కావడం ෂීඨ.

నిన్నటి ఆదివారం మధ్యాహ్నం స్పెషల్ చేశానండి". అంటూ, హుషారుగా కూని రాగాలు తీస్తు గిన్నెలు, ప్లేట్లు డైనింగ్ టేబుల్ మీద పెట్టి పిల్చింది.

పిల్లలు ప్లేట్లు పట్టుకొని టీ.వి ముందు కూర్చోని కారూన్ ఛానల్స్ చూస్తూ తింటున్నారు. సుబ్బారావుకు వడ్డించి, తను ఒక ప్లేట్తో పక్క కుర్చీలో కూచోని తింటు, ఖచ్చితంగా మెచ్చుకుంటాడీ రోజు అని ఎదిరి చూస్తుంది. కాని, ఎప్పటిలాగానే నిశ్శబ్దంగా తింటున్నాడు. సగం తినడం అయిపోవచ్చింది. వుండబట్టలేక అడ్డింది.

"ఏమండి ఈ రోజు స్పెషల్ వండాను గదా! ఎట్లున్నదో చెప్పనేలేదు".

నిశబ్దం... నిశబ్దం....

మళ్లి అడ్డింది. "ఏమండి విుమ్మల్నే అడ్డేది. మాట్లాడరేంటి?” ప్రశ్నించింది.

“ఏమో... నాకేమి స్పెషల్ అనిపించడం లేదు. ఇవ్వాల కొత్తగా తిం

టున్నానా? కొత్తగా అడ్డుతున్నావు. అంటూ పెరుగు వేసుకొని తినడం ముగించి, వాష్ బేసిన్లో చేతులు కడుక్కొని నాప్కిన్తో మూతి తుడ్చుకొంటున్నాడు.

‘అది కాదండి. ప్రతి రోజు మీరే కూరగాయలు తెస్తుంటారు గదా! నేను చెప్పినవి దొరకలేదని, మర్చిపోయానని ఏనాడు చెప్పిన ఐటమ్స్ అన్ని తీసుకరారు గదా! నిన్న సాయంత్రం నేనే ఆటోలో వెల్లి రైతు బజారు నుండి వంటకు కావల్సినవన్ని తెచ్చుకున్నానండి. ශ්‍රීඩුණූ చెప్పిన కొలత ప్రకారమే చేశాను. అయినా మీకు రుచించడం లేదంటే నాకేదో అనుమానంగా వుందండి. ఇంత కంటె ఎవరు బాగా చెస్తారో మరి. అసలు మీ మనస్సులో ఏముందో చెప్పండి". నిలదీసినట్టడిగింది.

“అందరు భర్తలు తవు భార్యల్ని ఎంతో మెచ్చుకుంటారు. మీరున్నారు ఎందుకు. కలర్లెస్ ఫేస్ పెట్టి, ఎప్పుడు ృదో కోల్పోయినాడిలా”. నిషరంగా అనేసింది.

పిల్లల్ని అడ్డాలనుకొని విరమించుకొంది. మూడ్ ఆఫ్ అయింది.

తినంగా మిగిలిన కూర పక్కింటి శైలజకిచ్చింది. “నీ కోసం అపుడే ఈ గిన్నెలో తీసి పెట్టాను వదినా మాటల్లోబడి మర్చెపోయాను. స్పెషల్ వంట వాసనకు మీ అన్నయ్య ఒక్కటే తొందర పెడితేను". అంది.

"ఇంకా మేము తిన్లేదు లేటయ్యింది. మీ అన్నయ్య బయటకెళ్లి రాలేదు. ఆయన కోసమే చూస్తున్న. గిన్నె తీసుకుంటూ శైలజ ഴഠ6.

• * *

సాయంత్రం శైలజ వచ్చింది. “ఏమి వదినా ఏం జేస్తున్నావు?"

“రా... వదినా... రా. ఆడవాళ్లకు ఏదో పని వుండనే వుంటది గదా. నీకు తెల్వనిదేముంది". అంటూ డైనింగ్ టేబుల్ కుర్చి జరిపి కూచోమంది.

“ఏమి వదినా ఈ వేళప్పడవి. పనులైనయా?"

“ఆ పనులెప్పడుండేవేనాయే? శైలజ.

"కూచో వదినా, కాఫి పెత్తాను". అంటూ కిచెన్లోకి వెళ్లింది శ్రీ లక్ష్మి

రెండు కప్పల్లో వేడి వేడి కాఫి వచ్చింది.

"నేనొచ్చిన అసలు విషయం చెప్పనే లేదు కదూ. అయ్యో నా మతి మర్పు వుండా, నువ్వు మధ్యాహ్నమిచ్చిన కర్రి చాల టేస్టుంది. రియల్లి డెలిషియస్'

“నిజుంగానా? వదినా! ముసి ముసిగా నవ్వుతూ හටයි.

"ఎట్ల జేసినవో చెప్పవూ. రేపు నేను చేద్దామనుకొంటున్నా.

“అవునా! అంత బాగా నచ్చిందన్న మూట. సుబ్బారావుకు వినబడెటట్టంది, మధ్యాహ్నమన్న మాటలు గుర్తాచ్చి.

ෆ డ్రాయింగ్ రూంలో సండే మ్యాగజైన్ చదువుతున్నోడికి సంభాషనంతా స్పష్టంగా వినబడుతోంది.

“సరే వదినా... ఈ విషయమే చెప్పి వెళ్తామని వచ్చా ఇగ వెళ్లి రాత్రికి వంట చేయాలి గదా... వస్తానొదినా అంటు లేచి నిల్చుంది శైలజ. “సరె వుంచిది వదినా. నేను రేపు వచ్చి నేర్పిస్తలే. ఈ సామాన్లు తెచ్చిపెట్టండి". అంటూ ఒక లిస్ట్ రాసిచ్చింది శ్రీలక్ష్మి • * * రాత్రంుంది. పిల్లలు ఆకలవుతుందని తొందరగానెడిన్నర్ ముగించేశారు. "ఏమండి మీకేమో నచ్చలేదు మధ్యాహ్నం స్పెషల్ కాని పక్కింటి శైలజ వదినకు, అన్నయ్యకు తెగ నచ్చిందట. ఎలా చేశానో నేర్చుకోటానికి వచ్చిందండి". అంది డిన్నర్ చేస్తూనే. “అవునా? అలాగా! అమాయకంగా డిన్నర్ చేస్తు అన్నాడు సుబ్బారావు. “వచ్చే ఆదివారం ఇంకో స్పెషల్ చేస్తా నుండండి. ఖచ్చితంగా మీరె లోట్టలేసుకుంటూ తింటారు". ఏ స్పందన లేకుండా తల కిందికేసుకొని తిని లేచాడు. ఎంగిలి గిన్నెలు తీసి సింక్లో పెట్టి, స్టవ్ శుభ్రం చేసి, కిచెన్లో రేపటి టిఫిన్స్ కోసం సిద్ధం చేస్తుంది శ్రీలక్ష్మీ పిల్లలు నిద్రపోతున్నారు. కొద్ది సేపు బయట వాకిట్లో వాకింగ్ చేసి, వచ్చి పిల్లల పక్కన పడుకొన్నాడు. © 4 o' సార్ క్రEంట్రో విల్స్తో “ఏంటి ఇంత పెర్గింది బిల్. ఆశ్చర్యంగా అడ్డాడు సుబ్బారావు. “ఈ మధ్య టీవీలు, కంప్యూటర్లు ఎక్కువ చూస్తున్నారేమో సార్". కారణం అర్థమైంది. రోజు అన్ని చానలల్ల వంటల కార్యక్రమాలు చూస్తున్నందుకేననుకొన్నాడు. బిల్ తీసుకొని పర్స్లో పెట్టుకున్నాడు.

ఇంట్లో రోజుకో కొత్త రుచి. వంటింట్లో క్యాలండర్ మీద డేట్ పక్కన ఆ రోజు వండిన వంట పేరు రాసుకొంటుంది శ్రీలక్ష్మీ, “ఏంటి. శ్రీలక్ష్మీ ఈ మెను ఎందుకు రాసుకొంటున్నావు?". అడిండు. "అదాండి. నేను ఒక శపధం పట్టాను. కనీసం నెల రోజులైనా చేసిన వంట చేయకుండా, వెరైటీస్ చేయాలని నిశ్చయించుకొన్నా" అని వివరణిచ్చింది. స్తారు. నువ్వెవో వంటల వ్రతాలు చేస్తున్నావే". "నాకు వంటలు రావు. నాకు కళ లేదు. నీకు అదృష్టం లేదని పెత్తైన కొత్తలో ఏవేవో అనేవారు కదండి. అందుకే ఈ

水>k>k水

ఆఫిస్కు వెళ్లేటప్పుడు ఒక స్లిప్ లిస్ట్ రాసివ్వడం. నిన్న టీవిలో చూసిన వంటకు కావాల్సిన సరుకులు, కూరగాయలు మసాలాలు సాయం కాలం వచ్చెటప్పడు తేవడం సుబ్బారావుకు డ్యూటి అయిపోయింది.

ఒక్క రోజు చేసిన వంట ఇంకో రోజండడం లేదు. శ్రీలక్ష్మీని మెచ్చుకోని దినం లేదు. శ్రీలక్ష్మీలో కొత్త ఉత్సాహాన్ని నింపుతోంది. భార్యామణి ఉబ్బి తబ్బిబ్బయి పోతుంటే, భర్త, పిల్లలు ఉబ్బిపోతున్నారు. శ్రీలక్ష్మీ పేరు ప్రఖ్యాతులు కాలని అంతా పాక్షిపోయాయి.

రోజు ఏదో స్పెషల్ చేయడం, పక్కింటి వదినకు, ఎదురింటి అక్కకు సాంపిల్ పంపించడం, వాళ్లు మెచ్చుకోవడం ධූෆණී తృప్తిగా వుంది. కొత్త కొత్త ప్రయోగాలకు ప్రేరణవుతోంది. మసాల వంటల తిండి అరగడానికి కూల్డ్రింక్, సోడాల ఖర్చుపెరింది.

తమ్ముడు, మర్లలు, వాళ్ల పిల్లలు సెలవుల్లో వచ్చి నాగుగైదు రోజులుండి పోతున్నారు తరచుగా.

米米冰冰

"అక్కా! నీ వంట మా పిల్లలకు చాల యిష్టమే. అందుకే వచ్చాం". నవ్వుకుంటు చెప్పాడు తమ్ముడు.

“అవును వదినా... మీరు చేసె చికెన్ సిక్సిటిపై గోంగూర మటన్ అంటే మీ తమ్ముడికి ఎంతిష్టమో." అని మెచ్చుకొని తన క్రోఇక తీర్చుకొంటుంది మర్ధలు.

అందరు కల్సి డిన్నర్కు కూర్చున్నారు.

"ఏమండి నా పెళైనా కొత్తలో మొద్దు నీకేమి వంటలు రావు అనే వారు. ఇపుడేమో నీ లాంటి భార్య దొరకడం అదృష్టమని మెచ్చుకుంటున్నారు. చూశారా. నేను తల్చుకుంటే ఏ పనైనా చేయగలనని ఒప్పకొంటారా" ఆత్మ విశ్వాసంతో అంది.

"అవునే. అదే టీవిలో ప్రోగ్రామ్స్ చూసి రాసుకున్నంత సిన్సియర్గా, సీరియస్గా రాసుకొని చదువుకొనివుంటే ఈపాటికి గ్రూప్ వన్ ఆఫిసరయ్యిపోయెదానివే". అన్నాడు సుబ్బారావు.

"చీ పోండి." ముసి ముసిగా నవ్వుతూ, సిగుపడిపోతోంది.

"నిజమేనె అక్కా! నీ మర్ధలుకు చెప్పతూనెవుంటా మా అక్కలా వంటలు నేర్చుకోవే అంటుంటా. మొద్దు మొఖంది ఏది నేర్చుకోదు. తినాలనిపిస్తే మీ అక్క దగ్గరికెళ్లి నాల్గొద్దులుండి రాపో, చూసినట్టుంటుంది. కోరిక తీరినటుంటుంది అంటది". మెచ్చుకున్నట్లో, ఫిర్యాదు చేసినట్టో చెప్పాడు.

“చూడవు వదినా... నెల తప్పినోడి తీరు ఇది కావలే, అది కావలంటే నాతో ఎక్కడవుతుంది. పిల్లలతోనె దినమంతా సరిపోతది'. సంజాయిషి ఇచ్చుకొంది మర్ధలు.

水冰冰水 చుట్టాలు వస్తే పూటకో వెరైటి, పోయెటప్పుడు పార్శిల్ కట్టివ్వడం, కొందరైతే అడ్డీ మరి చేయించుకొని తిని వెళ్తున్నారు. కాలనీలో ఏ ఇంట్లోనైనా స్పెషల్ చేయాల్సివస్తే శ్రీలక్ష్మికి భలే గిరాకి. 水冰冰水 సుబ్బారావు, పిల్లలు అందరు మంచి మంచి రుచులకు అలవాటు పడ్డారు. తినే క్వాంటిటి 下。Söf○○. “ఏంటోయ్ రేపటి వెరైటీ." హుషార్గా అడుతున్నాడు భర్త

"సస్పెన్స్. తినబోతు రుచులడడమెందుకో". అని చురకలేస్తుంది.

కూరగాయలు రేటు మండిపోతున్నాయి. రోు రోు ఖర్చు పెరిపోతుంది. అలవాటు పడ్డారు. తిండి క్రోసం క్రాకపోత్రే ఎందుకు సంసాదించేది అని సమర్థించుకొని మరి వెరైటీస్ చేసుకుంటు తింటున్నారు. జీతం సరిపోవడం లేదు.

ఇంట్లో అందరి బట్టల కొలతలు మారిపోతున్నాయి. నెల రెండు నెలల్లోనే పొట్టిగైపోతున్నాయి. పాత బట్టలు స్టీల్ సామాన్లోల్లకు

వేయడంతో, సీలు గిన్నెల సంఖ్య పెరిగిపోతోంది ఇంట్తో, © ço 冰冰水水

"ఏమండీ. నాకీ మధ్య కీళ్ల నొప్పలొస్తున్నాయి. వెస్టర్న్ టాయిలెట్ వుంటే బాగుండు". శ్రీలక్ష్మి విన్నపం. సుబ్బారావుకు బరువు పెరడంతో అలానే వుంది. రెండవ అంతస్టుకు మెట్టు ఎక్కడం దిగడం కష్టమవుతుంది. వెంటనే ఇల్లు వెదికె ప్రయత్నం మొదలు పెట్టాడు. నచ్చిన ఇల్లు కిరాయెమో ఎక్కవగావుంది. అధనంగా రెండు వేలు కిరాయి పెరింది. కొత్త ఇంట్లోకి మారిపోయారు. గ్రౌండ్ ఫ్లోర్లో ఇల్లు, విశాలమైన గదులు, మెట్లు ఎక్కే బాధ తప్పింది. 水冰冰冰 సైకిలు మీద కాలేజికి వెళ్లే అమ్మాయిలకు కష్టమవుతుంది. పెరిగిన బరువుతో సైకిలు తొక్కలేకపోతున్నారు. స్కూటి కొనియ్యక తప్పింది కాదు. లోను తీసుకొని కొనియ్యాల్సి వచ్చింది. 水冰冰冰 అమ్మాయిలిద్దరి చదువులైపోయాయి. పెళ్లిల్ల చేయాలని నిర్ణయించుకున్నారు. మొదటి ఘట్టం పెళ్లి చూపులు. ఎన్ని సంబంధాలు వచ్చినా కుదరడం లేదు. కారణం అమ్మాయిలు చాలా లావుగా వున్నారని. ఇపుడే ఇట్లుంటే పిల్లలు పుట్టినంకా ఎలా వుంటారో... వూహించుకొని కొందరు, బరువుకు తగ కట్న కానుకల వూండ్తో మరికొందరు. ఏది ఫైనల్ కావడం లేదు. ముద్దుగా వుండె అమ్మాయిలిద్దరు బొద్దుగా తయారయ్యారు. వయస్సు పెరిపోతోంది. తల్లిదండ్రులకు ఆవేదన, ఆందోళన పెరి ఆలోచనల్లో పడ్డారు. పరిష్కార మార్గం ఆలోచించి ఆలోచించి టెన్షన్తో బి.పి. షుగర్డు ఆహ్వానించని అతిథిల్లాగా వచ్చాయి. గోళీలు, మందుల ఖర్చుపెరింది. అన్నింటిని కంట్రోల్గా తినాల్సి రావడం భరించలేనంత కష్టంగా వుంది. నోరు కట్టేసుకొని, కోరికల్ని చంపుకోవడం ఎవరివల్ల కావడం లేదు. 水>k>k水 ఎలాగోలాగు కోరినంత కట్టం ఇచ్చి పెద్దమ్మాయి పెండ్లి చేశాడు. దొరికినకాడల్ల అప్ప తెచ్చాడు. వడ్డికి వడ్డీ భూమ్మీద కాలుష్యం పెర్లినట్టు పెర్తి పెరి మోయలేనంత అయ్యింది. వడ్డిదార్లకు అబద్దాలు చెప్పలేక, ముఖం చూపించలేక, ఎన్ని రోజులో దాక్కోలేక తలలు పట్టుకొన్నాడు. ఎంత ఆలోచించినా.. అప్పలు తీరె మార్గం కనబడకపోవడంతో చనిపోవడమే పరిష్కారమని భావించాడు. తనకు నచ్చిన వంట చేయించుకొని తృప్తిగా ఆరగించి, జీవితం ముగిచ్చేద్దామని నిర్ణయించుకొన్నాడు. మధ్య రాత్రి లేచి ఊరవతల ఉన్న ఒంటి మామిడి చెట్టు దగ్గరికి వెళ్లిండు. చెట్టు కొమ్మకు తాడు వ్రేలాడదీద్దామని చెట్టు ఎక్కిండు. తాడు బిగించిండు. తాడు నాణ్యతను పరీక్షించాలనుకొని, పట్టుకొని ఊగిండు. అతని బరువుకు చెట్టుకొమ్మ విరిగి తల మీద పడింది. నెత్తురు కారుతుంది. తెల్లని షర్ట్ ఎర్రగా తడిపోయింది. "కాపాడండి. కాపాడండి. తలపగిలింది. రక్తమంతా కారిపోతుంది. హెల్స్మిప్లీజ్. అంటూ కాళ్లు చేతులు తన్నుకొంటున్నడు మంచంలోనె. ఆ కేక విన్న శ్రీలక్ష్మీ కిచెన్లో ఎక్కడి పని అక్కడే వదిలేసి పరుగెత్తుకుంటచ్చింది. "ఏమైందండి. ఎందుకలా అరుస్తున్నారు. తలపగలడమేంటి?". అంటూ కంగారుగా భుజం తట్టి లేపింది. చెమటలు పట్టిపోయిన సుబ్బారావు దిగున లేచి కూర్చొని - “నాకేమి క్రా లేదా..? తల పగుల లేదా? తల తడిమి చూసుకొండు గుండె వేగంగా కొట్టుకొంటుంది. చెమటలు తుడ్చుకొంటున్నాడు.

"మీరు క్షేమంగానే వున్నారండి. భయపడకండి. మీకేదో పీడ కల వచ్చినట్టుందండి', ఓదారుస్తున్నది.

“అవునే... అది నా భవిష్యత్తు దర్శనమే. అందుకే నీ కూరలు నచ్చడం లేదే". పైకి వినబడేలా సుబ్బారావు మనస్సులోని మాట బయట పెట్టిండు.

ఏమి అర్థం కాని శ్రీలక్ష్మీ బిక్క మొఖమేసుకొని సుబ్బారావునే చూస్తుండిపోయింది. అయ్యో రామా నా ఖర్మ అని నొసలు కొట్టుకొంటు.


Comments