కథా రచయితలకు సూచనలు

1.ఈ వెబ్‌సైటులో మీ కథను ప్రచురించడానికి మేమెంతో ఉత్సుకతతో ఉన్నాము. ఏ కథ ప్రకటించాలో మీరే నిర్ణయించండి.
 
2. వీలైనంత వరకు మీరు పంపే కథ ఇతర సంకలనాలలో కానీ, సంపుటాలలో కానీ, స్వంత బ్లాగులలో కానీ ప్రచురింపబడకుండా ఉండాలి. పత్రికలలో ప్రచురింపబడి ఉంటే వాటి వివరాలు అంటే ఆ పత్రిక పేరు, వెలువడిన తేది మొదలైనవి పేర్కొనాలి. అముద్రితమైన కథలైతే మరీ మంచిది.
 
3.మీరు పంపబోయే కథ ఏదైనా ఒక ప్రత్యేకత కలిగి ఉండాలి. అది మీ రచనా సామర్థ్యాన్ని ప్రతిబింబించేదిగా ఉండాలి.
 
4.ఏ రచయితను అగౌరవపరిచే ఉద్దేశం మాకు లేదు. మాకు తెలిసిన రచయితలనందరినీ కథలను పంప వలసినదిగా ఉత్తరాల ద్వారా, ఫోన్ల ద్వారా, ఇతరత్రా ప్రత్యేకంగా కోరతాము. అందరి కథలు కాస్త ముందు వెనక ప్రకటింప బడతాయి. కథలు ప్రకటించే వరుస క్రమం గురించి మేము ఎటువంటి నియమాన్ని, ప్రమాణాన్ని పాటించటం లేదు దయచేసి గమనించండి.
 
5. మీ కథను తెల్లకాగితంపై ఒక వైపు వ్రాసిగానీ, ప్రచురింపబడిన కథ అయితే ఆ కథ జిరాక్స్ కాపీ గానీ పోష్టు లేదా కొరియర్ ద్వారా ఈ చిరునామాకు పంపగలరు. కె.మురళీ మోహన్, ఫ్లాట్ నెం.9111, బ్లాక్ 9-ఎ, జనప్రియ మహానగర్, మీర్‌పేట్, హైదరాబాద్ 500 079. లేదా మీ కథను http://lekhini.org సహాయంతో యూనికోడ్‌లో టైప్ చేసి mmkodihalli@gmail.com కు ఇ-మెయిల్ చేయవచ్చు. ఇది మాకు చాలా సౌలభ్యంగా ఉంటుంది.
 
6.కథతో పాటు మీ ఫోటో, బయోడేటా కూడా పంపండి.
7.ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా రచయితలకు ఎటువంటి పారితోషికం ఇవ్వలేము. ఎవరైనా స్పాన్సరర్లు దొరికితే అప్పుడు పారితోషికం గురించి ఆలోచించగలం.
Comments